పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న జీలం జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావం ముఖ్యంగా జలాల్పూర్ షరీఫ్ ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల్లో ఎక్కువగా కనిపించింది. గోడలు కూలడం, పైకప్పులు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు