తెదేపా మహానాడు 2026 ప్రారంభమైంది. ఇవాళ, రేపు హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతుంది. మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం మొదలైంది. పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు నివాళులర్పించారు. ఈసారి ‘స్త్రీ శక్తి’ థీమ్ మహానాడు జరుగుతోంది.