కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. పినరయి విజయన్ ఇంటిపై బుధవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఎక్సాలాజిక్ కేసుకు సంబంధించి తిరువనంతపురంలోని అద్దె ఇంట్లో సోదాలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పది చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కన్నూర్‌లోని ఆయన ఇంట్లో కూడా సోదా జరుగుతున్నట్లు సమాచారం. పినరయి విజయన్ అద్దె ఇల్లు, కన్నూర్‌లోని ఆయన ఇల్లు, సీఎంఆర్ఎల్ కార్యాలయంతో సహా 12 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.