స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. ఈ ఇన్నింగ్స్ తో ఆయన ఐపీఎల్ 2026 సీజన్ లో 600 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలోనే వరుసగా నాలుగు సీజన్లలో 600 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ పై 500 పరుగుల ద్వారా, ఐపీఎల్ లో ఎనిమిది వేర్వేరు జట్లపై 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.