ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వేసవి తాపానికి జనం అల్లాడిపోతుండగా, రోజురోజుకూ ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురులో 47.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై అధికారిక వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లతో పాటు బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల మేర భానుడు ప్రతాపం చూపించాడు.