మావోయిస్టు పార్టీ మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సలైదాతో పాటు ఆయన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్ లత, అలియాస్ పూనం, అలియాస్ జోబా మంగళవారం డిజిపి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డిజిపి సివి.ఆనంద్ మాట్లాడుతూ దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమం మారుతు వస్తుందని, ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయ్యిందని చెప్పారు.