గాంధీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడి చేయడంతో జూనియర్ డాక్టర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. జూనియర్ వైద్యుడు శివశంకర్ రోగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు చెప్తున్న సమయంలో మౌనిక మెర్లిన్ నిరంతరాయంగా వీడియో కాల్లో మాట్లాడుతుండటంతో డాక్టర్ ఆమెను వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తూ వైద్యుడిని ఫోన్లో చిత్రీకరించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వైద్యుడు ఆమె ఫోన్‌ను తీసుకుని డ్యూటీ సిస్టర్‌కు అప్పగించగా, ఆగ్రహించిన మౌనిక మెర్లిన్ డాక్టర్ శివశంకర్‌పై చేతులతో దాడిచేసింది.