<span;>ఏపీలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెట్వర్క్ సమస్యలేర్పడి రిజస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. సమస్యను గుర్తించిన రిజిస్ట్రేషన్ల శాఖ నెట్లో పాలను సవరించింది. మరికొన్ని చోట్ల మధ్యాహ్నానికీ నెట్వర్క్ అందుబాటులోకి రాలేదు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, కృష్ణాజిల్లా ఉయ్యూరు, విజయవాడలోని గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెట్వర్క్ సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. అనంతరం అధికారులు కొన్ని చోట్ల సమస్యను పరిష్కరించారు.