విజయవాడ TDP లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకీ లక్ష్మికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ’ కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో జరిగినట్లుగా భావిస్తున్న అక్రమాలు, అవకతవకలపై ఈడీ అధికారులు ప్రస్తుతం ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే ఈనెల 27వ తేదీన (బుధవారం) తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.