వెండి తెరపై విలక్షణ పాత్రలు, అద్భుతమైన డ్యాన్సులతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే పోడ్ కాస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి ‘మెగా పాడ్ కాస్ట్’ అని పేరు పెట్టారు. చిరంజీవి పాడ్ కాస్ట్ చేయబోతున్నారని గతంలోనే ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల చిన్న క్లూ ఇచ్చారు. మెగాస్టార్ జీవితంలోని ఎవరికీ తెలియని విషయాలతో పాటు సినిమా రంగంలో ఆయనకు ఎదురైన కష్టాలు, వాటి నుంచి గట్టెక్కిన తీరుని వివరించబోతున్నారట. ఇది నిజమేనని తెలిసిపోవడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.