భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)తో పోరాడుతున్న వినేశ్ ఫొగాట్ పునరాగమనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆసియా క్రీడల ఎంపిక పోటీల్లో ఆమె పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. తల్లైన రెజర్ల విషయంలో డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలు అనుచితంగా ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం వినేశ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పునిచ్చింది. దాంతో.. ఆమెను అడుగడుగునా అడ్డుకోవాలని చూసిన బ్రిజ్ భూషణ్ గ్యాంగ్‌కు హైకోర్టు నిర్ణయం చెంపపెట్టు కానుంది.