నియోజకవర్గాల విభజనపై మాట్లాడే ముందు ఏపీ మంత్రి లోకేష్ లెక్కలు సరిచూసుకోవాలని చిదంబరం విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం మార్పులు చేయకుండా పునర్విభజన చేపడితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని ఆయన ట్వీట్ చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెడుతోందని లోకేష్ ఆరోపించారు. ఆర్టికల్ 81 ప్రకారం 2026 జనాభా లెక్కల తర్వాత దక్షిణాది స్థానాలు తగ్గిపోతాయనేది నిజం కాదా అని ప్రశ్నించారు.