తెలంగాణతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసు కీలక మలుపు తిరిగింది. మధ్యంతర బెయిల్ ఈ దశలో ఇవ్వలేమని హైకోర్టు చెప్పడంతో బండి భగీరథ్ శనివారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పేట్‌బషీరాబాద్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి ఎదుట సరెండెర్ అయ్యారు. మే 8వ తేదీన కేసు నమోదు అయినప్పటి నుంచి ఈ కేసు అనేక రకాల మలుపు తిరుగుతూనే ఉంది. అప్పటి నుంచి బండి భగీరథ్ పరారీలో ఉన్నారు