ఉపాధి హామీ కూలీలను టిప్పర్ ఢీకొట్టడంతో.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్.. కాకినాడలోని.. కొవ్వూరు బ్రిడ్జి దగ్గర జరిగింది. తెల్లవారు జామున.. ఉపాధి హామీ పనుల కోసం కూలీలు వెళ్తుండగా.. వారిని వేగంగా వచ్చి టిప్పర్ ఢీకొట్టినట్లు తెలిసింది. స్థానికులు.. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. ఐతే.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో స్థానికంగా ఆందోళన ఉంది.