తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల ప్రదర్శన వేతనాలు, పర్సంటేజీ విధానంపై నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాల మధ్య నడుస్తున్న వివాదానికి తెరదించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) రంగంలోకి దిగింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకుగానూ ఫిల్మ్ ఛాంబర్ 15 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరిశ్రమలోని మూడు ప్రధాన వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ.. ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు, ఐదుగురు ఎగ్జిబిటర్లతో కమిటీని రూపొందించారు.