భారత్ కి చెందిన వ్యక్తులైనప్పటికీ, ఇతర దేశాల పౌరసత్వం కలిగి ఉండి చట్టవిరుద్ధంగా తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసిన సుమారు 25 మందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఓటు వేసిన అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన నిందితులను చెన్నై, మదురై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి వారు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాతే రాష్ట్రానికి చేరుకున్నారని, సిరా చెరిగిపోయే వరకు ఇక్కడే ఉండేందుకు ప్లాన్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది.