అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యూఏఈపై దాడులు జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. జాతీయ ఐక్యత, భద్రత,
ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు యూఏఈ తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి భారత్ ఎప్పుడూ దౌత్య చర్చలకే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.