భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాల .. ఇప్పుడు ఒక తల్లిగా కోట్లాది మంది మనసులను గెలుచుకుంటున్నారు. తన బిడ్డకు పాలిస్తూనే.. ఆ భాగ్యం లేని అనాథలు, అనారోగ్యంతో ఉన్న పసిపాపల ఆకలి తీర్చి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తన బాబు పుట్టిన మొదటి ఏడాదిలో సుమారు 60 లీటర్ల తల్లిపాలను హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులలోని మిల్క్ బ్యాంక్‌లకు ఆమె విరాళంగా ఇచ్చారు. కేవలం 100 మిల్లీలీటర్ల తల్లిపాలు,కిలో బరువున్న పసిబిడ్డకు కొన్ని రోజుల పాటు అమృతంలా ఉపయోగపడతాయని ఆమె వెల్లడించారు.