పుట్టపర్తిలో శుక్రవారం నాడు దేశం గర్వించదగ్గ అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజలో పాల్గొన్నారు. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), డీఆర్డీఓ (DRDO) సంయుక్తంగా సుమారు రూ. 15,803 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును 650 ఎకరాల్లో నిర్మించనున్నాయి. ఇది భారత్‌లో మొట్టమొదటి 5వ తరం (5th Generation) స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కావడం విశేషం.