నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో నీట్ ప్రశ్నపత్రాలను ముందే పొందేందుకు దళారులు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది. ప్రధానంగా రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఉన్న కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. నిందితుడు దినేష్ బీవాల్ నీట్ ప్రశ్నపత్రం యొక్క హార్డ్ కాపీని సంపాదించి PDF ఫైల్స్‌గా మార్చి విద్యార్థులకు వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు తేలింది.