కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి.. నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జరిగాసింగ్ అని చెప్పారు. ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌లలో బంగారు షాపులపై ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాగీరా సింగ్ సహా ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్‌లను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.