మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో ఘోర విషాదం జరిగింది. జిల్లాలో టోంక్ కాలాన్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంలో క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు