తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’,తెలుగులో ‘వీరభద్రుడు’ సినిమా ఇవాళ గురువారం థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ విడుదలకు ముందు ఊహించని విధంగా ఈ సినిమాకి ఆర్థికపరమైన చిక్కులు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో మార్నింగ్ షోలు రద్దయ్యాయి. తమిళంలోనే కాదు, తెలుగులోనూ మార్నింగ్ షో పడలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు థియేటర్లలో ఉదయం ఆటలు నిలిపివేశారు. మ్యాట్నీ షో బుకింగ్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని సమాచారం. సినిమా క్యాన్సిల్ పై నిర్మాత ఎస్ఆర్ ప్రభు, హృదయపూర్వక క్షమాపణలు” అని ట్వీట్ చేశారు.

