దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన శుభమ్ ఖైర్నార్ను సీబీఐ అధికారులు బుధవారం ముంబైలోని కిల్లా కోర్టులో హాజరుపరిచారు.
విచారణ అనంతరం కోర్టు నిందితుడికి రెండు రోజుల ట్రాన్సిట్ కస్టడీ మంజూరు చేసింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి లీకైన ప్రశ్నపత్రం హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, బీహార్, కేరళ వంటి పలు రాష్ట్రాలకు చేరినట్లు సీబీఐ అనుమానిస్తోంది.

