తాజాగా ఆర్బీఐ గవర్నర్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెరుగుతున్న క్రూడాయిల్ ధరలను భరిస్తూ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. IMF సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఆర్థిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

