ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్త రైతాంగానికి మేలు చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాబోయే ఖరీఫ్ సీజన్‌ను పురస్కరించుకుని పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల పెట్టుబడి ఖర్చుపై 50 శాతం అదనపు లాభం చేకూరేలా ధరలను సవరించారు. దీని ప్రకారం, సాధారణ రకం వరి క్వింటాల్‌కు రూ. 2,441 గా, గ్రేడ్-ఏ వరి క్వింటాల్‌కు రూ. 2,461 గా నిర్ణయించారు.