తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన చివరికి అసెంబ్లీ రద్దుకు దారితీసింది. ఇప్పటికే ఎన్నికల్లో పరాజయం పాలైన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ తాజాగా అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం లేని పరిస్థితి ఏర్పడింది.
ఒకవైపు పాత ప్రభుత్వం నిష్క్రమించడం, మరోవైపు కొత్త ప్రభుత్వం కొలువుదీరకపోవడంతో పరిపాలన పరమైన సందిగ్ధత నెలకొంది.