టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక 155 పరుగులకే పరిమితమైంది. అనంతరం 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఆది నుంచే దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 52 బంతుల్లోనే 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఆయన ఇన్నింగ్స్‌లో 6 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు ఉండటం గమనార్హం.శాంసన్ ధాటికి ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.