పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, మాజీ మంత్రి మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లను అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.
“ఈ ఎన్నికల్లో సుమారు 70 నుండి 72 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 5 కోట్లు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారు. నన్ను కూడా అదే మొత్తం అడిగారు, కానీ అక్రమంగా డబ్బులు ఇచ్చి పోటీ చేయడం ఇష్టం లేక నేను నిరాకరించాను. అందుకే నాకు షిబ్పూర్ టికెట్ ఇవ్వలేదు” అని తివారీ కుండబద్దలు కొట్టారు.