మరోసారి అధికారం తమదేనని ధీమాగా ఉన్న DMK పార్టీకి ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఉదయం నుంచి వెలువడుతున్న ప్రాథమిక ట్రెండ్స్‌లో డీఎంకే కూటమి ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఫలితాల ప్రభావం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లను కార్యకర్తలు తొలగిస్తూ, బోరున విలపిస్తూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సుమారు 100కి పైగా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

