మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగంగా ప్రతిజ్ఞ చేశారు. “ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం చేసే కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతామని ఈ పవిత్ర స్థలంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

