టీడీపీ ఈ ఏడాది మహానాడు సభను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని భావించినప్పటికీ,తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేదికను నెల్లూరు జిల్లాకు మారుస్తూ నిర్ణయించారు. వేదిక మార్పుకు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కారణం. జూన్ లేదా జూలై నెలల్లో ప్రధాని మోదీ ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకే ప్రాంతంలో తక్కువ వ్యవధిలో రెండు భారీ రాజకీయ సభలు నిర్వహించడం కంటే, వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించటం ద్వారా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

