జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మధ్యరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగింది. ఉదయము 11.00 గంటల వరకు సమ్మె సాఫీగా కొనసాగుతున్నప్పటికీ 11.00 గంటల తర్వాత ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్ల తో పోలీస్ పహార మధ్య ఆర్టిసి బస్సులు బయటకు కదిలాయి. గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పోలీస్ పహార మధ్య బస్సులు బయటకి కదులుతున్నాయి.

