తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నియమించిన కమిటీతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ (JAC) జరిపిన చర్చలు విఫలం కావడంతో, హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ వంటి ప్రధాన బస్టాండ్లలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఆటో డ్రైవర్లు అదను చూసి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. డిపోల వద్ద కార్మికులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

