ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటూ ఖరీదైన కార్లు, పబ్‌లలో దిగిన ఫొటోలను చూపిస్తూ తాను రిచ్ ఫ్యామిలీకి చెందినవాడినని నమ్మించి చాటింగ్ ద్వారా ప్రేమ పేరుతో లోబరుచుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 మందికి పైగా యువతులను అర్జున్ మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధిత యువతుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు

