దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపులు, మతమార్పిడి కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న తరుణంలో, పోలీసులు వస్తున్నారనే విషయాన్ని ముందే పసిగట్టిన నిదా ఖాన్ అక్కడి నుంచి చాకచక్యంగా పరారైనట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు నిదా ఖాన్ భర్తను ప్రశ్నించగా, ఆయన పోలీసులకు సహకరించి ఆమె ఉంటున్న లొకేషన్‌ను వెల్లడించారు. పోలీసులు వస్తున్నారని గ్రహించిన నిదా ఖాన్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి మాయమైంది.

