సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నాగపూర్ తండా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శ్రావణి ఉదయం స్కూటీపై స్కూల్కు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. దీంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె స్కూటీపై నుంచి పడిపోయారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాదుకు తరలించారు. ఈ ఘటనపై నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

