ఉత్తరాంధ్ర వాసులు శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా వెళ్లాలంటే విశాఖకు వెళ్లి, అక్కడి నుంచి మరో రైలు ఎక్కి వెళ్లాల్సిన పరిస్ధితుల్లో రైల్వేశాఖ ఇవాళ్టి నుంచి డైరెక్ట్ రైలు హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి మధ్య వారానికోసారి రాకపోకలు సాగించేలా రూపొందించిన ఈ రైలును ఇవాళ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు. శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో ఇవాళ్టి నుంచి ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది.

