మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సెక్యూరిటీ సూపర్ వైజర్ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళను సెక్యూరిటీ సూపర్ వైజర్ మోహనచారి ఏడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తాను చెప్పినట్టు వినాలని లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరిస్తున్నాడు.ఈ మధ్య వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. మహిళ భర్త చనిపోవడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తోంది.

