కర్ణాటకకు చెందిన ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరిని లక్ష్యంగా చేసుకుని ఫేస్బుక్లో కొన్ని వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వరుస పోస్టులు పెట్టారు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సోషల్ మీడియా యుద్ధాలు, కోట్ల రూపాయల నష్ట దావాలతో వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చుకుంటున్న ఇద్దరు అధికారులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలికేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా నియమిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.