ఢిల్లీలో జనసేన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ అని రోపించారు. బీజేపీ పలికించేవే పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణను వ్యతిరేకిస్తూ మోదీ, అమిత్ షా చేసిన పలుకులనే పవన్ కళ్యాన్ రిపీట్ చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణకు వొద్దని ఆపడం లేదని చెప్పారు. తెలంగాణకు వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు.