అమెరికా-ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెరపడుతూ శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించింది. ‘దిశా’ అనే LNG ట్యాంకర్ ఖతార్‌లోని రాస్ లఫాన్ పోర్టు నుంచి ద్రవీకృత సహజవాయువు (LNG)ను తరలిస్తోంది. మాల్టా జెండా కింద నడుస్తున్న ఈ నౌక AIS రికార్డుల్లో భారతీయ నౌకగా నమోదై ఉండటం ఆసక్తికరంగా మారింది. మార్చి 2 నుంచి ఈ నౌక రాస్ లఫాన్లోనే నిలిచిపోయింది. శాంతి ఒప్పందం అనంతరం మళ్లీ ప్రయాణం ప్రారంభించినట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా వెల్లడించింది.