సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు.రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్వేర్ రంగాల్లో సహకారం కావాలి. సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు ఏపీ యువత సిద్ధంగా ఉంది.ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలన్నారు. పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రసీలో జాప్యం లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు.