రష్యాకు చెందిన ‘షాడో ఫ్లీట్’ (రహస్య చమురు రవాణా నౌకాదళం) లో భాగమని బలంగా అనుమానిస్తున్న ‘స్మిట్రోస్’ అనే ముడి చమురు ట్యాంకర్‌ను బ్రిటన్ భద్రతా అధికారులు ఇంగ్లిష్ ఛానెల్‌లో విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. రష్యాపై అంతర్జాతీయంగా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఉల్లంఘించి చమురు రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై బ్రిటన్ సైనిక దళాలు రంగంలోకి దిగి ఈ చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా నౌకలో ఉన్న ఒక భారతీయ పౌరుడిని అధికారులు అరెస్టు చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.