కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈనెల 23వ తేదీ నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల 10శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నీరజ్ మిట్టల్ స్పష్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు.

