మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. తాజాగా Dubaiలోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. కాన్సులేట్ భవనానికి ఆనుకుని ఉన్న పార్కింగ్ ప్రాంగణంలో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. అమెరికా విదేశాంగ శాఖాధికారి ప్రకారం, అక్కడ ఉన్న అమెరికా సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.

