దక్షిణ లెబనాన్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పలుచోట్ల భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. లెబనాన్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు ప్రాంతీయ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

