ఇరాన్ సుప్రీం లీడర్ మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యు తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

