నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా సాగుతున్న భారీ క్రికెట్ బెట్టింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాల నెట్వర్క్ను నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల దందా నిర్వహిస్తున్న ముఠా నాయకులను కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన బెట్టింగ్ మాఫియా లీడర్లు కూసెట్టి వేణుగోపాల్, బిట్ర వెంకటరమణ అధిక లాభాలు వస్తాయంటూ ఇన్వెస్ట్మెంట్ పేరుతో యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని తెలిపారు.

