వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఓ కుటుంబం అన్నారం షరీఫ్ దర్గాలో కందూరు చేసుకొని తిరిగి ట్రాక్టర్లో వస్తుండగా తీగరాజుపల్లికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో అందులో ఉన్న చిన్నారితో పాటు డ్రైవర్ మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ మద్యంమత్తు ప్రమాదానికి కారణమని స్థానికులు వివరించారు.

